EAPCET ఇంటర్ మార్కుల వెయిటేజీ తొలగింపు.
ఏపీ ఇంజినీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీ సెట్)లో ఇంటర్ మార్కుల వెయిటేజీ తొలగించను న్నారు. సీబీఎస్ఈ, ఇంటర్ పరీక్షలను రద్దు చేసినందున పూర్తి వెయిటేజీని రాత పరీక్షకు ఇవ్వాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించి ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఇప్పటి వరకు ఈఏపీ సెట్లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉండగా.. రాత పరీక్ష 75శాతం మార్కులకు ఉండేది. ఈఏపీ సెట్ను 160 మార్కులకు నిర్వహించ నున్నారు. కరోనా కారణంగా ద్వితీయ సంవత్సరం పాఠ్యప్రణాళిక 30శాతం తగ్గించినందున ఆ మేరకు ప్రశ్నలు తగ్గనున్నాయి. మొదటి ఏడాది పాఠ్యప్రణాళిక నుంచి ప్రశ్నలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు 2.02లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఈనెల 25 తో దర ఖాస్తు గడువు ముగియనుంది.
