IIT- కాన్పూర్ శాస్త్రవేత్త మనీంద్ర అగర్వాల్ ప్రకారం, దేశంలో కరోనా థర్డ్ వేవ్ అక్టోబర్ మరియు నవంబర్ మధ్య ఉద్ధృతంగా ఉండొచ్చని అంచనా వేశారు. సెప్టెంబర్ నాటికి, కొత్త వైరస్ వేరియంట్ ప్రస్తుత వైరస్ వేరియంట్లను అధిగమించినప్పుడు, పరిస్థితి మరింత దిగజారిపోతుందని అంచనా వేశారు. సెకండ్ వేవ్ కేసులతో పోల్చినప్పుడు, థర్డ్ వేవ్ తీవ్రత తక్కువగా ఉన్నట్లు ఉంటుంది అన్నారు.
ఇది చదవండి 👉🏻 వారికి ఒక డోస్ చాలు ...
థర్డ్ వేవ్ తీవ్రత ఎలా ఉండబోతుందన్న అంశంపై మనీంద్ర నేతృత్వంలోని ముగ్గురు శాస్త్రవేత్తల బృందం గణిత నమూనా ఆధారంగా వివిధ అంచనాలు రూపొందించింది. ‘‘ప్రస్తుత వైరస్ రకాలే కొనసాగితే పరిస్థితిలో ఎలాంటి మార్పూ ఉండకపోవచ్చు అన్నారు. ఒకవేళ వీటికి భిన్నమైన, ప్రమాదకర కరోనా వైరస్ పుట్టుకొస్తే మాత్రం... గరిష్ఠంగా రోజూ లక్ష వరకూ కేసులు నమోదవుతాయి. ప్రస్తుతం డెల్టా కంటే ప్రమాదకరమైన వైరస్ రకాలు మన దేశంలో లేవు అన్నారు. ఒకవేళ సెప్టెంబరు నాటికి అలాంటి పరిస్థితి ఎదురైతే మాత్రం... మూడోదశ కేసులు అక్టోబరు-నవంబరు మధ్య తీవ్రస్థాయిలో ఉంటాయి’’ అని అగర్వాల్ తెలిపారు. ప్రస్తుత డేటా ప్రకారం వైరస్ పునరుత్పత్తి రేటు (R value) 0.89 శాతంగానే ఉంది. ఈ విలువ 1 కంటే తక్కువ ఉన్నంతవరకూ వైరస్ వ్యాప్తి అదుపులో ఉన్నట్లు బావిస్తున్నామనరు.
