రాజధానిగా వైజాగ్...
రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించి.. రెండు సంవత్సరాలు దాటిపోయింది.అమరావతి ప్రాంతం నుంచి సచివాలయాన్ని తరలించాన్ని నిరసిస్తూ రైతులు చేపట్టిన ఉద్యమాలు.. తెలుగుదేశం పార్టీ ఆందోళనలు మూడు రాజధానుల ఏర్పాటుకు కొంత అడ్డంకిని కల్పించాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం కూడా మూడు రాజధానుల ఏర్పాటుకు కొంత ఆటంకాన్ని కలిగించింది. మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియను ఈ ఏడాది పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నట్టు కనిపిస్తోంది జగన్ సర్కార్.పెట్రోల్ పెరుగుదలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రాజధానుల పట్టీకలో ఏపీ రాజధానిగా విశాఖ అని ఉంది. దీంతో భూమి బద్ధలైనట్టు, ఆకాశం తలకిందులైనట్టు సదరు మీడియా చేస్తున్న హాహాకారాలు వెగటు పుట్టిస్తున్నాయి.
పెరిగిన పెట్రోల్ ధరల ప్రభావంపై రాష్ట్రాల్లో అంచనా వేశారా? అంటూ ఎంపీ కుంభకుడి సుధాకరన్ కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా కేంద్ర ప్రభుత్వం నగరాల్లో పెరిగిన పెట్రోల్ ధరలను అంచనా వేసింది.
ఈ సందర్భంగా కేంద్రం విడుదల చేసిన జాబితాలో రాజధానుల పట్టికలో ఏపీ రాజధానిగా విశాఖగా అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
