West Nile Virus : ఇప్పటికే కరోనా వైరస్ తో చేస్తున్న పోరాటంతో ప్రపంచ దేశాలకు మరో కష్టం వచ్చింది. ఆర్థిక భారంతో దేశాలు ములుగుతుంటే పులిమీద పుట్రలాగా మరో ముప్పు వచ్చి పడింది. కొత్త వైరస్తో ప్రపంచానికి ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తోంది రష్యా. దీనికి ప్రస్తుతానికి చికిత్స గానీ టీకాలు గాని లేవంటోంది.
దోమకాటు ద్వారా మానవుల్లోకి వైరస్ సంక్రమిస్తుందని..ఈ వైరస్ సోకితే తీవ్రమైన నరాల సంబంధ సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు రష్యా సైంటిస్టులు. అదే ‘వెస్ట్ నైల్ వైరస్’ (‘West Nile Virus’). ఈ వెస్ట్ నైల్ వైరస్ ఇప్పటికే రష్యాలో శరవేగంగా వ్యాప్తి చెందుతుండటంతో రష్యా సైంటిస్టులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
రష్యాలో ఇప్పుడు టీకాలు గానీ..ఎటువంటి మందులు కానీ లేని ‘వెస్ట్ నైల్’ (డబ్ల్యూఎన్‌వీ) ఆందోళన కలిగిస్తోంది. ఇది ఈ వైరస్ ఉన్న దోమలు కుట్టడం ద్వారా ఇది మనుషులకు సోకుతుంది. రష్యాలో వెలుగు చూస్తున్న వెస్ట్ నైల్ కేసుల్లో 80 శాతానికి పైగా నైరుతి ప్రాంతంలోనే నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. వచ్చేది శీతాకాలం కావటంతో ఈ వ్యాధి మరింతగా పెరగవచ్చని రష్యా ఆరోగ్య శాఖ ఆందోళనవ్యక్తం చేస్తోంది.
కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ దేశాలను రష్యా హెచ్చరించింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఈ వైరస్ పెరుగుతున్నా..రానున్న కాలంలో దోమలు పెరిగే అవకాశాలుండటంతో ఈ వైరస్ కలిగి ఉన్న దోమలు కుడితే మరింతగా ఈ వైరస్ కేసులు పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని దోమలుకుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
