మన వాట్సాప్ వచ్చేసింది, సందేశ్ యాప్ లాంచ్ చేసిన కేంద్రం.
కేంద్రం స‍్వదేశీ వాట్సాప్ 'సందేశ్'ను విడుదల చేసింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీ నిబంధనల నేపథ్యంలో కేంద్రం స్వదేశీ వాట్సాప్‌ను లాంఛ్ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా యాప్‌కు సంబంధించి కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లోక్ సభలో కీలక ప్రకటన చేశారు.
నేషనల్ ఎన్ఫోర్మేటిక్స్ సెంటర్(NIC) తో పాటు ప్రభుత్వ ఐటీ విభాగం కలిసి డిజైన్ చేసిన స్వదేశీ వాట్సాప్ సందేశ్ అందరికి అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. ఈ నిర్వహణ బాధ్యతలన్నీ కేంద్ర ప్రభుత‍్వమే చూసుకుంటుందన్న ఆయన.. వాట్సాప్ తరహాలో వన్ టూ వన్ మెజేసింగ్, గ్రూప్ మెసేజింగ్, ఫైల్, మీడియా షేరింగ్, ఆడియో, వీడియో కాల్స్ తో పాటు ప్రభుత్వ అప్లికేషన్ ఈ యాప్ లో ఉన్నట్లు చెప్పారు.
అంతేకాదు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ సంస్థలు మాత్రమే వాడుతున్న ఈ యాప్ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. ఇక ఈ యాప్ ప్రత్యేకత ఏంటంటే వాట్సాప్ కేవలం ఫోన్ నెంబర్‌తో మాత్రమే లాగిన్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ సందేశ్ యాప్ మాత్రం ఈమెయిల్ తో ఓపెన్ చేసేలా రూపొందించారు. అయితే సందేశ్ యాప్ ఎంతమేరకు ఆకట్టుకుంటుంది.? సందేశ్ తో వాట్సాప్ వినియోగం ఆగిపోతుందా? లేదా కొనసాగుతుందా అన్న అంశం నెట్టింట్లో చక్కెర్లు కొడుతోంది.
