టెక్నాలజీ వరల్డ్‌లో అనేక నూతన ఆవిష్కరణలకు కేరాప్ అడ్రస్‌గా యాపిల్ నిలిచింది. ఏదైనా ఫీచర్‌ని యాపిల్ అందుబాటులోకి తెచ్చిందంటే మిగిలిన కంపెనీలన్నీ ఆ బాటలోనే నడుస్తాయి. వాటిలాగానే మరో కొత్త ఫీచర్‌ని యాపిల్ అందుబాటులోకి తేనుందని మార్కెట్‌లో చక్కర్లు కొడుతోంది.
ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న మొబైల్ ఫోన్లు అన్నీ కూడా నెట్‌వర్క్ ఆధారంగా పని చేస్తున్నాయి. 2జీ మొదలుకుని ఇప్పుడు ఎల్‌టీఈ (లాంగ్‌టర్మ్ ఎవల్యూషన్), 5జీ వరకు వచ్చాం. శాటిలైట్ ఆధారంగా ఈ నెట్‌వర్క్‌లు పని చేస్తున్నాయి. అయితే వీటిని మించేలా భవిష్యత్తులో లియో నెట్‌వర్క్‌లు అందుబాటులోకి రాబోతున్నాయి. దీని ద్వారా లియో టెక్నాలజీలో సిమ్‌తో అవసరం లేకుండా నేరుగా హ్యండ్‌సెట్ ద్వారానే ఇటు కాల్స్, అటు డేటాకు సంబంధించి మరింత మెరుగైన కమ్యూనికేషన్ కొనసాగించవచ్చు.
ఐఫోన్ 13లో ఈ ఫీచర్ :
ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా యాపిల్ తన కొత్త ఐఫోన్ మోడల్ ఐఫోన్ 13ను సెప్టెంబరు 14న తీసుకువస్తుంది. త్వరలో రిలీజ్ చేయబోతున్న యాపిల్ 13 మోడల్ లియో ఆధారంగా పని చేసే అవకాశం ఉందని మార్కెట్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే మొబైల్ ఆపరేటర్‌కు ప్రస్తుతం చెల్లిస్తున్నట్టుగా ప్రత్యేకంగా ఏమైనా రీఛార్జీలు ఉంటాయా? లేక హ్యండ్‌సెట్ ధరలోనే అఅన్నీ పొందు పరుస్తారా అనే అంశంపై చర్చ జరుగుతోంది. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే దీనికి సంబంధించి యాపిల్ నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఐఫోన్ 13లో శాటిలైట్ నెట్వర్క్ కనెక్టివిటీ ఫీచర్ను తీసుకొస్తున్నట్లు తెలిపారు. అంటే సాధారణ మొబైల్ నెట్వర్క్ అందుబాటులో లేని ప్రాంతాల్లో ఐఫోన్ 13 నుంచి శాటిలైట్ నెట్వర్క్ ద్వారా ఫోన్కాల్స్, మెసేజ్లు చేసుకోవచ్చని మింగ్ వెల్లడించారు. అలానే తక్కువ ఎత్తులోని భూమి కక్ష్య (ఎల్ ఈవో)లో కూడా శాటిలైట్కు కనెక్ట్ అయ్యేందుకు ఐఫోన్ 13లో క్వాల్ కోమ్ ఎక్స్60 మోడెమ్ ఉపయోగించినట్లు తెలిపారు.

