ప్రస్తుతం అంతా డిజిటల్ పేమెంట్స్ హవా నడుస్తోంది. ప్రజలు క్యాష్ పేమెంట్ల కంటే డిజిటల్ పేమెంట్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వాట్సాప్ కూడా గతంలో పేమెంట్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ద్వారా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో చాట్ చేస్తూనే సులభంగా డబ్బు పంపించుకోవచ్చు. అయితే డబ్బు పంపడంతో పాటు తమ అనుభూతిని తెలియజేయడానికి ఇప్పుడు సరికొత్త ఫీచర్‌ను చేర్చింది వాట్సాప్. ఇకపై అవతలి వ్యక్తికి డబ్బులు పంపేటప్పుడు యూజర్లు 'పేమెంట్ బ్యాక్‌గ్రౌండ్'ను జోడించుకోవచ్చని తెలిపింది .
ఇది కేవలం భారత యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండటం విశేషం. డబ్బులు పంపే సమయంలో ఇకపై యూజర్లు బ్యాక్‌గ్రౌండ్ థీమ్ ద్వారా తమ భావాల్ని కూడా వ్యక్తపరచవచ్చని వాట్సప్ అభిప్రాయపడింది. గూగుల్ పే పేమెంట్స్ బ్యాక్‌గ్రౌండ్ తరహాలోనే ఇదీ పనిచేస్తోంది.
బ్యాక్‌గ్రౌండ్ ఎలా యాడ్ చేయాలి?
లావాదేవీ విలువను ఎంటర్ చేయండి.
బ్యాక్‌గ్రౌండ్ అనే ఐకాన్‌పై క్లిక్ చేయండి.
నచ్చిన థీమ్‌ల కోసం స్క్రోల్ చేసి సెలెక్ట్ చేసుకోండి
తర్వాత బ్యాక్‌గ్రౌండ్ ఆప్షన్‌ను డిస్మిస్ చేసి చెల్లింపు చేసేయండి.
బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేసిన తర్వాత కూడా లావాదేవీ మొత్తాన్ని మార్చవచ్చు.
